HomeMovie NewsGood Bad Ugly Teaser Coming Soon టీజర్ రిలీజ్ కి రెడీ అయిన 'గుడ్...

Good Bad Ugly Teaser Coming Soon టీజర్ రిలీజ్ కి రెడీ అయిన ‘గుడ్ బ్యాడ్ అగ్లి’

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ తల అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుడ్ బాడ్ అగ్లీ. ఈ సినిమాపై అజిత్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల విడాముయార్చి మూవీతో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకో లేకపోయిన అజిత్, ఈ మూవీతో పెద్ద విజయం అందుకోవటం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. 

అన్నివర్గాలు ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకుంటుందని తప్పకుండా రిలీజ్ అనంతరం గుడ్ బ్యాడ్ అగ్లి విజయం ఖాయమని టీం కూడా హోప్స్ పెట్టుకుంది. మరోవైపు ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ వారు అటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ అందుకోవాలని చూస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp

See also  Young Director wish to do More Movies with Venkatesh వెంకటేష్ తో మరిన్ని మూవీస్ చేయనున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories